schedule Tuesday, September 08, 2026

భయపడకుండా పాలించండి..!

calendar_today December 17, 2025
person dharshininews
భయపడకుండా పాలించండి..!
భయపడకుండా పాలించండి..! - కాంగ్రెస్ బెధిరింపులకు పాల్పడితే సహించం - కొత్త సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి - తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు భయపడకుండా పాలన చేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లో పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు రోహిత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి కొత్త సర్పంచులతో సమావేశం అయ్యారు. గ్రామాల్లో అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బెదరింపులకు భయపడవద్దని అన్నారు. రాజ్యాంగ బద్దంగా గ్రామాలకు రావాల్సిన నిధులను ఎవ్వరు ఆపలేరని అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, కోహిర్ శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, బీఆర్ఎస్ మహిళ కన్వీనర్ శకుంతల దేశ్ పాండే, ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40082/