schedule Tuesday, September 08, 2026

మృతి చెందిన కార్మికురాలుకు ఆర్థిక సాయం

calendar_today December 18, 2025
person dharshininews
మృతి చెందిన కార్మికురాలుకు ఆర్థిక సాయం
మృతి చెందిన కార్మికురాలుకు ఆర్థిక సాయం - రూ. 10వేలు అందజేసిన మున్సిపల్ కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మృతి చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలుకు ఆర్థిక సాయం అందించారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జోన్ 3లో నర్సమ్మ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేసేది. గురువారం ఆమె మృతి చెందిన విషయాన్ని ఏఐటీయూసీ నాయకులు మున్సిపల్ కమీషనర్ యాదగిరి దృష్టికి తీసుకవెళ్లారు. 10వ పీఆర్సీ ప్రకారం మృతి చెందిన కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని నిబంధన మేరకు కమీషనర్ యాదగిరి స్పందించి ఆర్థిక సాయం అందించారు. అంత్యక్రియల ఖర్చుల కింద రూ. 10వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు కమీషనర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40092/