schedule Tuesday, September 08, 2026

పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి ఘనంగా సన్మానం

calendar_today December 18, 2025
person dharshininews
పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి ఘనంగా సన్మానం
పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి ఘనంగా సన్మానం - పాదయాత్ర పూర్తి సందర్భంగా అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్) కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి సన్మానం జరిగింది. సువర్ణభూమి శబరిమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో నవంబర్ 7వ తేది నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు తాండూరు నుంచి శబరిమలకు 1280 కిలోమీటర్లు నడిచి క్షేమంగా రావడంతో కళాశాల, పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయ బృందంతో పాటు ఖాoజాపూర్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాలినడకన శబరిమలకు వెళ్లడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగా కూడా అనేక ప్రయోజనాలు కలిగినట్లు చెప్పారు. అతి సామాన్యమైన వ్యక్తిగా యాత్రలోని కష్టాలను సహిస్తూ ముందుకు సాగడం వల్ల భగవంతునిపై భక్తితో పాటు నిత్యజీవితంలో ఎలా ఉండాలని తెలిసిందన్నారు. 38 రోజులు పాదయాత్రకు సహకరించిన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, పాఠశాల, కళాశాల సిబ్బందికి, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40094/