schedule Thursday, July 09, 2026

పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి అభినందనలు

calendar_today December 20, 2025
person dharshininews
పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి అభినందనలు
పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి అభినందనలు - ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్) కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి సువర్ణభూమి శబరిమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో నవంబర్ 7వ తేది నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు తాండూరు నుంచి శబరిమలకు 1280 కిలోమీటర్లు నడిచి క్షేమంగా వెళ్లిరావడంతో వారిని అభినందిస్తూ ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు పివిఆర్ ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాలినడకన అంత దూరం వెళ్లి రావడం చాలా గొప్ప విషయం అన్నారు. దేవుని అనుగ్రహం ఉంటే తప్ప ఇంత పెద్ద యాత్రను కాలినడకన చేయలేమని పేర్కొన్నారు. పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాలినడకన శబరిమలకు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అందుకు సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు బాల్ రెడ్డి, కిరణ్ కుమార్, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, జగన్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, సుహాస్, జయవర్ధన్ రెడ్డి వున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40104/