schedule Thursday, July 09, 2026

రామ మందిరానికి భక్తుల విరాళాలు

calendar_today December 21, 2025
person dharshininews
రామ మందిరానికి భక్తుల విరాళాలు
రామ మందిరానికి భక్తుల విరాళాలు - దేవాలయ పునర్ నిర్మాణానికి చేయూత - ధన్యవాదాలు తెలిపిన దేవాయల కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లో పునర్ నిర్మిస్తున్న రామ మందిరానికి భక్తులు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ఆదివారం పట్టణానికి చెందిన రవీంద్ర ఆచార్య రూ. 51 వేలు, బాలాజీ మెడికల్ రాజు రూ.25వేలు, కె. శ్రీనివాస్ రెడ్డి రూ. 11 వేలు విరాళాలు అందించారు. గత కొన్ని రోజులుగా రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దేవాలయ పనులకు ఆర్థిక సాయం అవసరం ఉండడంతో దేవాలయ కమిటి సభ్యులు దాతలను సంప్రదించారు. ఇందుకు వారు తగిన చేయూత అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. మరెవరైనా దాతలు దేవాలయ పునర్ నిర్మాణం కోసం చేయూత అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40114/