schedule Friday, July 10, 2026

రాంమందిర్ నిర్మాణానికి పెరుమాళ్ల వెంకట్ రెడ్డి విరాళo

calendar_today December 23, 2025
person dharshininews
రాంమందిర్ నిర్మాణానికి పెరుమాళ్ల వెంకట్ రెడ్డి విరాళo
రాంమందిర్ నిర్మాణానికి పెరుమాళ్ల వెంకట్ రెడ్డి విరాళo – ఆలయ కమిటి సభ్యులకు రూ. 51, 111/- అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇంద్రనగర్ లోని పురాతనమైన రాoమందిరాన్ని పునర్నిర్మిస్తున్నారు. వేగంగా జరుగుతున్న పనులకు భక్తితో తమ వంతు చేయూతగా పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్) కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మంగళవారం ఆలయ కమిటీ ప్రతినిధులకు రూ. 51,111/-/ను అందజేశారు. ఈ సందర్భంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి ఉడుత భక్తిగా సహాయం అందించేందుకు అవకాశం కల్పించిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. దేవుని ఆశీస్సులతో ఆలయ నిర్మాణానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరంలా తాండూరులో చక్కగా రామాలయాన్ని నిర్మించుటకు పూనుకున్న కమిటీ సభ్యులను అభినందించారు. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని హిందూ బంధువులందరూ రామాలయ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40168/