schedule Tuesday, September 08, 2026

రాముని గుడికి విరాళం..!

calendar_today December 23, 2025
person dharshininews
రాముని గుడికి విరాళం..!
రాముని గుడికి విరాళం..! - తండ్రి జ్ఞాపకార్థం ఆర్థిక సాయం - యూత్‌ కాంగ్రెస్ నాయకుడి దాతృత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : తన కూతురు పుట్టిన రోజుతో పాటు తండ్రి జ్ఞాపకార్థం తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్‌ కుమార్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లో పునర్‌ నిర్మిస్తున్న రామ మందిర దేవాలయానికి ఆర్థిక సాయం అందించారు. మంగళవారం తన కూతురు పుట్టిన రోజుతో పాటు తండ్రి స్వర్గీయ కావలి మొగులయ్య జ్ఞాపకార్థి దేవాలయ పునర్‌ నిర్మాణం కోసం తన వంతుగా రూ. 21వేలను దేవాలయ కమిటి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటి సభ్యలు కావలి సంతోష్ కుమార్ దంపతులు అభినందించారు. అదేవిధంగా దేవాలయ పునర్‌ నిర్మాణం కోసం దాతలు తమ వంతు సాయం అందించి దేవాలయ పురోగతికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40174/