schedule Tuesday, September 08, 2026

చలికాలంలో వెచ్చని సేవ..!

calendar_today December 23, 2025
person dharshininews
చలికాలంలో వెచ్చని సేవ..!
చలికాలంలో వెచ్చని సేవ..! - వృద్ధులకు దుప్పట్లు పంపిణీ - మార్వాడి యువమంచ్ సామాజిక సేవ తాండూరు, దర్శిని ప్రతినిధి : చలికాలంలో తాండూరు మార్వాడి యువమంచ్ వెచ్చని సేవ కార్యక్రమం చేపట్టింది. మంగళవారం తాండూరు మార్వాడి యువమంచ్ తో పాటు రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 65 మంది వృద్దులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి యేడాది మార్వాడి యువమంచ్ సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా చలికాలంను దృష్టిలో ఉంచుకుని వృద్ధుల ఆరోగ్యం కోసం దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ అధ్యక్షులు అనిల్ సార్థా, కోశాధికారి అరుణ్ సారడ్, జాతీయ కార్యదర్శి రోహిత్ అగర్వాల్, రాజస్థానీ మహిళ మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా, కార్యదర్శి వర్షా సార్డా, కోశాధికారి కల్పన రాఠి, సహాయ కార్యదర్శి రాధిక సార్థా తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40181/